funny jokes collection by rasp sadhana:01 to 15)
1.ఆ పెళ్ళి పందిట్లో అందర్లో కొందరు ఆశిస్తున్నట్లు,"ఆగండి" అనే మాట ఒక్కసారే అన్నారెవరో: కానీ ఇంకో రెండు సార్లు ప్రతిథ్వనించిందో, మరెవరన్నా టైం వేస్టు చేయకుండా అనేశారేమో మరి.తరువాతి డైలాగులు సీన్లు ఇవి.
"పెళ్ళికూతురు 'జం-పారిపోయింది'.పెళ్ళి'మోస్టు వామ్టేడు' .వీడియోగ్రాఫరు కూడా కనపట్టంలేదు.వీడియోగ్రాఫరు కూడా కనపట్టంలేదు". ఇది కొందరి రియాక్షను.
మెజారిటీ రియాక్షను కావాలా!!!!-
"ఇంకేం చేస్తాం భోజనానికి లేవండి.ఇంకేం చేస్తాం భోజనానికి లేవండి. ఇంకేం చేస్తాం భోజనానికి లేవండి". ఎంచక్కని రికామీ రియాక్షన్.
2.చాలా విచారంగా ఒక 'పెద్దన్నర' మనిషి ఓ థియేటరు గేటుకి ఉన్న 'హౌస్ ఫుల్ ' బోర్డునీ, అక్కడి బ్లాకు టిక్కెట్ల వాళ్ళనీ చూస్తూ, ఇల్లా అన్నాడు:
"పోయినవాళ్ళతోబాటు మనమూ పోతామాబాబు,....సినిమాకి"
3.అందరూ అ జలపాతాన్ని యెగాదిగా చూస్తున్నారు. విజిటర్స్ లో కొందరు గుసగుసలడుకొని, చిట్టచివరికి మోహమాటం విడిచి, ఆ 'గైడు దేవానందుణ్ణి ' అడిగేశారు...
"బాబూ, ఇది ప్రపంచం లోకెల్లా యెత్తైన జలపాతం అంటున్నారుగదా, మరి దాని గొప్ప సౌండు వినపడటంలెదేం!"
"మీతోపాటూ వచ్చిన ఆ నలుగురు 'ఆడ లేడీసూ' వాళ్ళ 'డిస్కల్మషం' ఒక్క క్షణం ఆపితే, మీకోరిక తీరుతుంది".
వీళ్ళు ప్రార్ధిస్తే,అతి కష్టంమీద వాళ్ళు ఆపారు. అప్పుడు భయంకరం అయిన ఆ జలపాతం హోరు వాళ్ళ చుట్టూ మర్మోగింది.
4."కొన్ని నిమిషాలు మీరందరూ అచ్చు మనుషుల్లాగ, సైలెంటుగా ఉంటే: కాస్త మీ యెటెండెన్సు తీసుకుంటాను".
"......"
"ఎటెండెన్సు బాగా ఉండాలోయ్, లేకపోతే చాలా సబ్జెక్ట్లు 'బ్యాకు లాగేస్తాయి '.దెబ్బకి వెన్నుబాము దెబ్బతింటుంది.75% ఎటెండెన్సు లేకపోతే హాల్ టికెట్టు, ఫీజు ఎంబర్సుమెంటు, స్కాలర్ షిప్పు....అన్నీ యెగిరి పోతాయి.-అనంగానే ఈ ఎదవ క్లాసులు 25% మనేయచ్చు అన్నమట: అని వెంటనే మన బ్రైనులో ఒక 'వెధవ ఉటోపియా' ఉదయిస్తుంది కదూ. ఇంకో 'ఉప ఎదవ ఉటోపియా' యేంటంటే- 35% పాస్ మార్కులురా అనంగానే: 65% ఈ యెదవ లెసన్సు వినక్కర్లేదెహ. ఇదీ మన పరిస్థితి.
5."క్లాసులు ఆబ్సెంటు అయితే మీకే చాలా నష్టం. యెందుకు నిన్న ఆబ్సెంటు అయ్యావురా?! అంటే,
'మా ముత్తాత గారికి ముప్పైమూడోసారి పెళ్ళిచూపులు అవుతున్నాయి,ఊళ్ళో అందరికి తెలుసు, మీకు తెలియదా?!'-అంటాడొకడు. ఈద్దర్నీ కలిపి తన్నాలి".
ఇంకోడు యేమంటాడంటే: 'మా అమ్మమ్మ చాక్లెట్లతో చారు తయారుచేసింది. దాన్ని శ్రీరామనవమి పందిట్లో పానకంగా పంచిపెట్టాం. అప్పుడు వూళ్ళో అందరికి విరోచెనాలు వచ్చాయి. మీరు తాగలేదా?!'-అంటాడు.
ఇంకోడు: 'మా ఇంటికి వచ్చే పోస్టు మానుకి జలుబు చేసింది, అన్నీ కారిపోతున్నాయీ-అంటాడు.
మరోడు: 'మా వీధి చివ్వర సెంటర్లో ఉంచునే పోలీసుకి వేడి చేసింది, అన్నీ ఆగిపోయాయి '- ఇవీ మీరు మానేయటానికి మహా కారణాలు"-కదూ.
6.ఓ 'బుడ్డి' కుర్రాడికి బలేగా ఓ అధ్బుతమైన శక్తి వచ్చేసింది. ఏంటంటే వాడు ఏమనుకుంటే అది మర్నాటికల్లా జరిగిపోతోంది. ఓసారి వాడికీ, వాడి ఫ్రెండుకీ చిన్న 'పిక్యు లాంటి తగూలాట' వచ్చింది. వాడు తన్నాడు, వీడికి కోపం వచ్చేసింది. 'ఈ ఫ్రెండు గాడు చచ్సిపోవాలి' అనుకున్నాడు. మరునాడు ఉదయానికల్లా ఆ ఫ్రెండు గాడు నిజంగానే చచ్చిపోయాడు. కొద్దిగా భయపడ్డా,'ఓర్నీ' అనుకున్నాడు మన బుడ్డి కుర్రాడు. కొన్నాళ్ళు గడిచిపోయాయి.
ఇంకోసారి ఏమయిందంటే, పక్కనే 'పెంకుటింట్లో అంకుల్తో' వీడి నాన్నకి ఎందుకో బాగా 'గొడవ తగూలాట' వచ్చేసింది. అప్పుడు వాడికి ఎదుటి డాబా అంకులు సపోర్టు కూడాను. ఈ సారి వీడి నాన్నకి బాగా పడ్డాయి: దెబ్బలు. మళ్ళీ వీడికి 'కోపాలు వచ్చేశాయి'. 'పక్కింటి వాడో,ఎదుటి డాబా గాడో ఎట్లీస్ట్ ఒక్కడైనా గుటుక్కు మనాలీ'. అనుకున్నాడు. మర్నాటి ఉదయానికల్లా 'ఎదుటి డాబా గాడు' చటుక్కున గుటుక్కుమన్నాడు.'అయితే, మనం, మన టంగు చాలా జాగర్తగా వుండాలి'. అనుకున్నాడు.
ఇంకా 'కొన్నిన్నర' రోజుల తరువాత ఒక తమాషా జరిగింది. వీడి నాన్న'షేవింగ్ గడ్డం' చేసుకుంటున్నాడు. వీడు ఊరికే వుండక, టైంపాస్ కి 'నాన్నా డిర్ర్ ....' అంటూ లుంగీ పట్టుకు లాగాడు. హటాత్తుగా కదిలేసరికి, నాన్నకి బ్లేడు గీసుకుని గాయం అయ్యింది. నాన్నకి కోపం. వీడి 'వీపు విమానాశ్రయం' అయిపోయింది. వీడికి కూడా కోపం. 'ఛీ నాన్న చచ్చిపోవాలి'. అనేసుకున్నాడు. మళ్లీ 'వద్దులే, ఈసారికి పోనీ'. అనుకున్నాడు.
మర్నాటి ఉదయానికల్లా ఓ 'వింతన్నర తమాషా ఘోరం' జరిగిపోయింది. ఏంటంటే... పక్కింటి పెంకుటింట్లో అంకులు 'కిక్ ద బక్కెట్టు'. అనగా అరుగు మీద ప్లాస్టిక్ బక్కెట్టు నిండా నీళ్ళు పెట్టి, అమాంతం ఎడం కాలుతో తన్నేశాడు. ద ఎండ్. దట్సాల్.
7."రెగ్యులర్ క్లాసులకి వస్తూ, రెగ్యులర్ గా చదువుతున్న వాళ్ళల్లో 50% మంది గారంటీగా అన్నీ పాసైపోయి, సెకండు యియర్ కి, వెళ్ళిపోతారు. ఎన్ని సబ్జెక్టులు ఫేలైనా, ఓహో, అల్లా అనకూడదు కదూ. మనకి 'బ్యాకు లాగేసినా' పందుల్ని తోసేసినట్లు తోసేయటమే, అదొక మహా సౌకర్యం ఉందిగా; 'రైతు బజార్ రూట్ లో ఆంబోతుల్లా' మనమేమీ సిగ్గు పడనక్కరలేదు. అసలు పరీక్షలలో మన హేండ్ రైటింగు బాగుండాలయ్యో!. అసలే మన హేండ్ రైటింగు చూడంగానే ఆ దిద్దే మహాత్ముడికి 'ఎయిడ్సు' రావడం ఖాయం. ఇంకేం దిద్దుతారూ?! 'ఏప్రెల్ ఎండ్ మే గాడ్ బ్లెస్ యూ'.
8."అయ్యా! మీకు మతిమరుపు వుండేదంటగా!?". "ఏమిటీ నాకు యీ.....మతిమరుపూ.... ఊ.... వుండేదయ్యో...". "ఏమిటీ ఏమి ఉండేది"? "అదేనయ్యా! మతిమరుపు...ఏదో కొద్దిగా వున్నట్లు గుర్తు". "కొద్దేమీ!, బాగానే వుండేదేమో...". "ఆ,ఆ, బాగానే వుండేదయ్యో" ...."అన్నట్లు అదే ఈ మధ్యనే కొద్దిగా తగ్గిందయ్యో..". "ఎంత తగ్గిందేమిటి?!"." సగానికి సగం తగ్గిపోయింది, తెలుసా!" "ఎల్లాగేమిటి?" "నేను మేధమేటికల్ గా, గణితశాస్త్ర రీత్యా ఋజూ చేయగలను". "ఎల్లాగేమిటి?""ఇదివరకు నేను ఎక్కడికెళ్ళినా, దాని దుంపతెగా.. నా రెండు చెప్పులూ మరిచిపోయేవాడిని. అయితే, ఈ మధ్య ఎక్కడికెళ్ళినా, దేవుడి దయవల్ల ఒక్క చెప్పే మరిచిపోతున్నాను.... చూశావా... రెండులో సగం ఒక్కటే గదా... అంటే, సగం జ్ఞాపకశక్తి పెరిగినట్టీ కదా, సగం మతిమరుపు తగ్గిపోయినట్టే కదా; "అవును సార్..." "చూశావా!నువ్వు జీనియస్సు కాబట్టీ నీకు వెంటనే అర్ధం అయిపోయింది. శుభమస్తు. వెళ్లిరా."
9."ఏమిటీ, ఈ సబ్జెక్టు: పేపరు హార్డు గా వుందా?!, బలేవాడివయ్యా బాబూ. సబ్జెక్టు హార్డు, పేపరు హార్డు.... అదంతా ఒట్టి ట్రాషు. మనం హార్డు వర్కు చేస్తే, ఆ సబ్జెక్టు యీజీ అయిపోతుంది. అదే మనం దాన్ని యీజీగా తీసేసుకుని, హార్డు వర్కు చేయకపోతే, పాపం ఆ సబ్జెక్టు హార్డు అయిపోయి కూచుంటుంది. సో, ఇతమిద్ధంగా మనం: దేన్నీ హార్డు అనలేం, యీజీ అనలేం. ఏదీ యీజీ కాదు, హార్డ్ అంతకన్నా కాదు.ఇంతకీ; 'ఎవ్వెరీ థింగ్ యీజ్ యీజీ, నాట్ ఫర్ లేజీ, ఇఫ్ లైఫ్ యీజ్ బీజీ'. డిప్ప వూడి పోతుంది ఆ డిప్లమా వచ్చేలోపల ...టేక్ ఇట్ యాజ్ యీజీ యాజ్ లేజీ యార్! ఓకే!"
10."అయ్యిందా, మన జులాయి వెధవ బజారు తిరుగుడు". "ఒరేయ్ నాన్న పిలుస్తున్నారు వినపడటం లేదా". "ఓహో దాన్ని పిలవటం అంటారా?సరే!". "పుస్తకం తీసి, ఎన్నాళ్ళయ్యిందిరా?!, బాగా చదువుకో, నిన్నే... నీ వయసులో జవహరు లాల్ నెహ్రూ కాలేజీ ఫస్ట్ వచ్చేవాడు, తెలుసా?!". "ఆహా! నాన్నా నీ వయసులో సేం జవహరు లాల్ నెహ్రూ మన దేశానికే ఫస్టు ప్రైం మినిస్టర్ అయిపోయాడు తెలుసా!!??"
11."బాగా చదువుకోండిరా బాబూ, చెప్పడమే మా ధర్మం, వినకపోతే కాలి బూడిదవబోతోంది మీ లైఫే. ఇంతకీ నువ్వప్పుడే 'రోబో గాడి'లా ఇట్టా ఇట్టా చదువుకుని మెట్లమీదినుంచి దిగుతూ వుంటావు. 'తస్సాదీయా తస్మదీయ' ఫాదరు నిన్ను తన ఫాలోయర్సుకి ఎల్లా పరిచెయం చేస్తాడో తెలుసా,...'ఇదిగో వీడే మా రెండో వెధవ, వారానికి ఒక్క సారి కూడా పుస్తకం తీయడు.'.... నీకు ఎక్కడ, ఎంత మండుతుందో..గానీ; ఓసారి, నీకూ ఈ 'ఎదవ టైం' కలిసి వస్తుంది. నీ ఫాలోయరులతో నువ్వుండగా, ఎడురవుతాడు పాపం మీ నాన్న. నువ్వూరుకుంటావా, నువ్వు ఇల్లా ఇంట్రోడ్యూసు చేసేస్తావు;'ఈడే మా మొదటి నాన్న, నెలకి ఇంకో వంద రూపాయలు సంపాయించమంటే, గిలగిలగిల కొట్టేసుకుంటున్నాడు".
11.”మా వాడు ఓ గొప్ప సైంటిస్టు అవుతాడు అనుకున్నాను”. “ఇంతకీ అయ్యాడా?!”. “ఎందుకు అవ్వడు!,అయ్యాడు, వాడి నిర్వాకం చూపించటానికే, నిన్ను మాఇంటికి తీసుకెళుతున్నాను”.”ఏం కనిపెట్టాడు?” . “ఆ బల్ల మీద చూడు.” “బ్రష్షు; పైంట్లు వేసేదా,పళ్ళు తోముకునేదా?! ”. “పళ్ళు తోముకునేదే...”. “మామూలు బ్రష్షు లాగానే వుందే?!”.
“ఇదీ అట్లాంటి ఇట్లాంటి బ్రష్షు కాదు, ఎల్లా వాడాలో తెల్సా?”. “ఎలా?” “బ్రష్షు మీద పేస్టు పెట్టుకోవాలి”. “అది మామూలే ...”. “అది మామూలే ...” ఏం?!“. “మరదే! అది అసలు మామూలే కాదు, నోట్లో పెట్టుకోవాలి”. “ఇల్లా,ఇల్లా తోముకోవాలి....”. “అదీ, అక్కడే బ్రహండమైన డిఫరెంసు, దీన్ని వాడుకోవటం లో వుంది”. “మరెల్లా...”.
“చేత్తో ఇల్లా ఇల్లా తోముకోకోడదు....మన ‘హెడ్డు తలే’ ఇల్లా ఇల్లా అడ్డంగా అడ్డంగా; నిలువుగా నిలువుగా; డయాగ్నల్ గా డయాగ్నల్ గా.....రౌండ్ గా రౌండ్ గా... ఇల్లా ఇల్లా ....తోమేసుకోవాలి”. “తరువాత”. “తరువాత, గుక్కెడు నీళ్ళు నోట్లో పోసుకొని, ‘వుం గడబిడ, వుం గడబిడ, వుం గడబిడ; దడ దడ చుక్ చుక్, దడ దడ చుక్ చుక్, దడ దడ చుక్ చుక్; ఇందాకడిదుందా, ఇందాకడిదుందా, ఇందాకడిదుందా; అని పుక్కిలించి, వుమ్మేయాలి.....”. “గొప్ప సైంటిస్టు గాడైయ్యా బాబు, మీవాడు... వినలేక ఆయాసం వచ్చేస్తోంది...”. “ఇంతకీ ఇది వాడితే, ఆయాసాలు గట్రా అన్నీ పోతాయిట.”. “అవును నేను కూడా పోతాను. వెళ్ళొస్తా..."
12.” ఈ సారి మీవాడు, అదేనయ్యా మీ సైంటిస్టు కుర్రాడు ఏం కనిపెట్టాడోయ్?!”. “ఈ మధ్యన చాలా కాలం ఊరికే ఉన్నాడు. ఇటీవలే, ఓ గోప్ప సోపు కనిపెట్టాడు”.”సోపా?! కూచునేదా, స్నానానికీ..., రుద్దుకునేదా?!”. “కూచునేదీ కాదు, నుంచునేదీ కాదు; వొళ్ళు రుద్దుకునే సబ్బైయ్యా సబ్బు”. “దీనికి మీవాడు కనుక్కునేది ఏం వుంది?, చిన్న పిల్లల సైన్సు పుస్తకాలలో, సబ్బు ఎల్లా తయారు చేయాలో చెప్తారు; మొన్న బ్రష్షు భాగోతం చూసాగా ”. “అద్దేమరి, ఇది వేరే టైప్; ఇంటికొచ్చి, చూడవైయ్యా బాబూ!”. “సరే పద...”.
“ఏదీ ఆ సబ్బు....?”. “ఇక్కడెల్లా ఉంటుందయ్యా...డ్రాయింగు రూములో.... నీ కన్నిటికీ తొందరే... పద బాత్ రూములోకి...”. “ఏదీ...అలమరల్లో సబ్బులేవీ కనపడవేం!!??”. “కిందికి చూడూ, కిందికి చూడూ....”. “ఇంత నున్నగా వుందేమిటి, టైల్స్ వేయించావా!;తాకి చూద్దాం, సబ్బు’ స్మెల్లువాసనే’..., కొంపతీసి, ఈ నేలంతా మీ వాడి సబ్బేనా ఏంటి?!”. “యా! అంతే.” “దీన్ని తీసి, ఎల్లా రుద్దేసుకోవటం: వొళ్ళంతానూ!?...”. “అద్దేమరి. మొదట రెండు చెంబులు నీళ్ళు వొంటిమీద పోసుకో...”. “తరువాత...”.
“తొందర పడకుండా కింద పడిపోవాలి... లేకపోతే...పడుకోవాలి. ఇంక చుస్కో....ఇప్పుడే తమాషా... ఇటు దొళ్ళు, అటు దొళ్ళు, కిందికి దొళ్ళు, పైకి దొళ్ళు, మళ్ళీ రెండు చెంబులు నీళ్ళు వొంటిమీద పోసుకో... మళ్ళీ నిలువుగా దొళ్ళు, అడ్డంగా దొళ్ళు, ఈ ఐమూలగా దొళ్ళు, ఆ ఐమూలగా దొళ్ళు, మళ్ళీ రెండు చెంబులు నీళ్ళు వొంటిమీద పోసుకో..... అల్లా ఇంకా ఇంకా లోపలికి దొళ్ళు, బయటికి దొళ్ళు...”. “బాత్రూమ్ లోంచి బయటికా?!”. “కాదైయ్యా బాబూ,ఇంక చాలు గానీ సుబ్బరంగా తుడుచుకో...”. “ఇంతకీ అక్కడ నిద్ర కూడా పోవచ్చా!!?, బలే సైంటిస్టు గాడైయ్యో మీవాడు”. “నువ్వేదో ‘గిన్నీసు,పిన్నీసు జీనియస్సు’వి కాబట్టీ, నీకర్ధం అయ్యింది. ఇంక వెళ్లిరా.శుభం”.
13.”హల్లో గురూగారూ,నమస్తే నండోయ్...”. “ఈ వెంకటేశం ఎవరు నాయనా...ఎవరు బాబూ ?!”. “అదే, నేనేనండీ, గుర్తు పట్టలేదేమో...గిరీశం నా పేరు”. “నా శిష్యులలో ఒకడివి అన్నమాట. వెరీ గుడ్....ఏమిటీ,ఎక్కడా??!!”.... ”నేను మీ ఫైనల్ యియరు స్టూడెంట్ని”. “ఏమిటీ, నా ఫైనలియర్ స్టూడెంట్వా, ఏ ఫైనల్ యియరు, ఏ కాలేజీ, ఏ కోర్సు???”. “అదే సార్,మాకు మీరు ఫైనల్ యియర్ హిస్టరీకి వచ్చేవారు”. “అల్లాగా, నా హిస్టరీ లో నువ్వో స్టూడెంట్ గాడివన్నమాట; మంచిది, ఎక్కడా,ఏమిటీ... ఎల్లా వుంది జీవితం!?”. “అంతా బానే వుంది సార్: జాబ్, ఆస్తీ, పెళ్ళీ, పిల్లలూ..... మీ దయవల్ల...”. “నాదేమి వుందిలే...అంతా ఆ దేవుడి దయ”. “మీరు ఇప్పుడు కాదనకుండా, మా ఇంటికి రావాలి సార్... “. “నువ్వు బలే వాడివి కానీ, బలవంతం పెట్టకయ్యా బాబూ, నీకు పుణ్యం వుంటుంది”. “ఆ, అల్లాగా కుదరదు. రండిసార్, రండిసార్, రాండిసార్....”.
“ఆ, గుర్తొచ్చిందిరోయ్, నువ్వా... నీ దుంపతెగ... ఏమీ రాయకుండా, ఇల్లాగే తెగ మొగమాటం పెట్టేస్సి, మార్కులు వేయించుకునేవాడివి, నువ్వా?!...”. “అమ్మయ్య గుర్తు పట్టేశారు.రండిసార్, రండిసార్, రాండిసార్....”. “సరే పద....”.”ఆ, బావుందోయ్, గుర్తు పట్టావు, ఇంటికి తీసుకొచ్చావు, మంచినీళ్ళు ఇచ్చావు; నీ సంసారం, అన్నీ బహు బావున్నాయి. ఇంక వెళ్తాను. శుభం...”. “అబ్బే ఇల్లా వచ్చి, అల్లా వెళ్లి పోతారా; కుదరదు. దయచేస్సి, టిఫెను అయ్యాక వెళ్ళుదురు గాని....”.
ఎప్పటిదో గానీ 'న్యూస్ పేపరు లాంటిది' తిరగేస్తున్నాను; లోపలికెళ్ళాడు. అయిదు, పది, పదిహేను,..... ఇంచుమించు అరగంట దాటింది. ‘ఏమయ్యాడబ్బా?!!... బయటికి వూడిరాడే,...’ చుట్టురా చూశాను.వాడు వెళ్ళిన రూము కర్టెను ఎగిరింది. వాడూ, వాడి కుటుంబం తినేస్తున్నారు: జుర్రుకుంటూ టిఫెను.’ ఇదన్నమాట, ‘టిఫెను అయినాక వెళ్ళమంటే...’వాడి టిఫెను అయిపోయాక మనం వెళ్ళాలని: అర్ధం. మహానుభావుడు, మహా మేధావి: కరెక్ట్ గానే మాట్లాడాడు. మనకే 'అర్ధం అర్ధ భాగం కూడా అర్ధం కాలేదు'.
'మహా సివిలైజుడు'గా కర్టెను తో మూతి తుడుచుకుంటూ బయటికి వస్తున్నాడు. "మాస్టారూ ,ఇంకేమిటి విశేషాలు...." అంటున్నాడు. ఇక తటపటాయిస్తూ...వుంటే లాభం లేదని; “ఇంక ఉంటానులేరా నాయనా...వెళ్ళొస్తా..”.”అబ్బే రాక రాక వచ్చారు, గురూగారూ, భోజనం కాంగానే... వెళుదురుగాని...”.”వొద్దొద్దు, ఇక మొహమాట పెట్టొద్దు. 'ఆటామిక్ ఎనర్జీ కంటే మొహమాటమిక్ ఎనర్జీ చాలా డేంజర్'. ఇబ్బంది పెట్టొద్దు.(నా కాలే కడుపుకి నా వొళ్ళు మండే....) టిఫెను దాకా చాల్లే, మళ్ళీ భోజనాల సంగతి ఎందుకులే?!... వెళ్ళొస్తా...శుభం.
- ‘ఆ పాత కాలనీలో: కొత్త వీధిలో వున్న పాత ఇంటిలోకి ఎవ్వరూ తొంగి చూడరు’. ఎందుకా!? ఆ మధ్యన ఆ కొంపలోకి: కొత్తగా ఒక ఫ్యామిలీ దిగింది. మెల్లిగా మొహమాటం వదిలించుకొని, మనవాడు ఆయన్ని పలకరించాడు. “గురూ, అగ్గిపెట్టుందా?!” ఆయన వీడికేసి ఎగాదిగా చూసి, “ఇదిగో!”. “దీన్లోపుల్లలేవీ?!”.”నువ్వేమడిగావ్?!”.”అగ్గిపెట్టె....!”. ” అది అగ్గిపెట్టే, దట్సాల్; అంతే”. ’ఈయన తో కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలేం....’. “నాతోనేగాదు, ఎవ్వరితోనైనా సరే.., కొద్దిగానే కాదు, పూర్తిగా జాగ్రత్తగా మాట్లాడాలి ఓకే!”. ‘ఈయనే ఇల్లాగుంటే....’.”నేనే కాదు, మా ఇంట్లోవాళ్ళు కూడా ఇంతే”.”మళ్లీ కలుస్తాం సార్”. “ఓకే!, కారీ యాన్...”.
కొంత కాలానికి, మన వాడు వాళ్ళింటికెళ్లాడు. ‘జాగ్రత్తగామాట్లాడుదాం’. ”పిన్నిగారూ, కూరేంచేశారు?”.”ఏంచేస్తాం!?, తిన్నాం, పారేస్తామా?! మీ ఇంట్లో తిన్నంత తిని, పారేసినంత పారేస్తారా?!”.’ఓరి నాయనో, ఇంకా అతి జాగర్తగా మాట్లాడాలి’.”అవును, జాగ్రత్తగా మాట్లాడటం మీరింకా ప్రాక్టీస్...చేయాలి”.
ఇంకొంత కాలానికి, ‘ఈ సారి దొరక్కోడదు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలిరోయ్’- అని చెప్పి, ఇంకో ‘అతని కంటే ఘనుడిని’ పంపించాడు. వాడు: “వదినగారూ, బియ్యం యేరుతున్నారా?!...”.”అబ్బే! రాళ్లేరుతున్నాను, ఏం?! మీఇంట్లో బీయం ఏరిపారేస్సి, రాళ్ళే వండి, వారుస్తారా?!”. ”కొందరితో మాట్లాడటం: జస్ట్ లెర్నింగు, కొందరితో మాట్లాడకపోటం: మహా ఎడ్యుకేషన్....”. "అంటే?!"."అంతే!?
14A.”హల్లో గురూగారు నమస్తే!”... “ఎవరు నాయనా మీరు!?, నమస్తే నమస్తే.... మీరెవరో గుర్టుపట్టలేకపోతున్నాను”. “ఫర్లేదు, ఈ గుర్తు పట్టలేకపోవడం అనేది వుంది చూసారూ... అది మీ ఏజ్ ఎఫెక్టు, ఇంకోటి కూడా వుందిలెండి; నాచేతిలో ఈ కప్పు కనపడుతోందా!?”. ”ఆ, కనపడుతోంది ఖాళీ కప్పు”. ”దీనిలో ఏం వుంది!?”. ”ఖాళీ, ఏమీలేదు”. ”అద్దేమరి, దీనిలో గాలి నిండి వుంది..ఫిజిక్సు ప్రకారం: గాలి నిండి వుంది చూశారా మీకు తోచలేదు,”. ” అవును, ఇంతకీ మీరెవరు?!”. ” “నేనెవరినో ఐనిస్టీన్ ని అడిగి, తరవాత చెబుతానుగానీ, ఈ కప్పు నిండా కొంచెం షుగరు తీసుకురండి, మీకో ముఖ్యమైన విషయం చెబుతాను”. ”షుగరు తీసుకు రావాలా, ముఖ్యమైన విషయం చెబుతారా!! ఏమిటబ్బా అది,”. “ ముందు తీసుకు రాండి, నేచెబుతాగా....”. లోపలికి వెళ్ళాడు, తెచ్చాడు, ఇచ్చాడు. “ఇదిగో, ఇప్పుడు చెప్పండి”. “వెరీ గూడ్, ఇందాక మీరు దీన్లో ఏముందన్నారు!?...”. “నేను ఖాళీ, మీరు గాలీ అన్నారు”. “యా, ఇప్పుడేంవుందీ?!”. “నిండా షుగరుంది”. “చూశారా.... ఇప్పుడు స్పాట్ లోకి వొచ్చారు, ప్రస్తుతానికి, వూళ్ళో మీకు చాలా మంచివారిగా, అడిగింది లేదనకుండా ఇచ్చేవారిగా... చాలా మాంచి పేరుంది; నిన్ననే దిగాం కదా, ఇంట్లో పంచదార డబ్బాకి కూడా సేం... కాఫీ, టీ ల్లోకి వాడే ‘షుగరు కంప్లెంట్’ వచ్చింది. మీకూ షుగరు కంప్లేంట్ ఆల్ రెడీ వుందీ... మా క్లినిక్ కి వచ్చి, టెస్టు చేయించుకోండి, మందులు వాడండి, ఆరోగ్యంగా వుండండి”. “ ఓహో! మీరేనా పక్క వీధిలో కొత్తగా దిగిన షుగరు డాక్టరు?!”. “అవును, చాలా తేలిగ్గా తేల్చేశారు...వస్తా”.

15.రైలు టక టక, టక టక, దడ దడ, దడ దడ, ఇందాకడిదుంద, ఇందాకడిదుంద అంటూ ‘ఫర్గెట్ ఎవ్వెరీ థింగ్ ఎండ్ పర్గేట్ సమ్ వేర్’ అనుకుంటూ పర్గేట్టేస్తోమ్ది. ఒకానొక ‘పెద్దన్నర’ మనిషి: తోటి ప్రయాణికులలో ‘తోచీ తోచని’ వాళ్లకి తనకి తోచినట్లుగా జాతకాలూ, గట్రా చెప్పేస్తున్నాడు. అప్పటిదాకా ముభావంగా వుండిపోయిన .... ఒక ‘ముప్పావు మనిషి’ మిగితావాళ్ళ సాటిస్ఫాక్షను... గమనించి, “న్నాక్కూడా చెప్పండి, న్నాక్కూడా చెప్పండి...”. అని పీకి, ప్రార్దించటం మొదలెట్టాడు. ఆయన వాడి చెయ్యి భూతద్దం మామూలుగా, తలక్రిందులుగా... పెట్టి చూసి, ‘లిప్స్ ని స్టిక్కు బ్రేకు’ చేసినట్లు విరిచేసి,... “అబ్బే, వొద్దు, నేను చెప్పను...” అనేశాడు.
వీడు వెంటబడి, పోరు పెట్టి, ఒదిలి పెట్టాడు. “నేనుగానీ నీకు జాతకం చెబితే సుమా.... నీ జీవితం 'బోటం టు టాప్ – అప్ అండ్ డౌన్' అంటే తలక్రిందులు అవటం ఖాయం, నేచెప్ప నేచెప్ప...” అనేశాడు. వీడు వొదల్లేదు. “ఆ భూతద్దం స్సూటిగా పెట్టుకుని ఆయన చెప్పేయటం మొదలుపెట్టేశాడు... “నువ్వు సగం బాగా చదువుకున్నావు. మేనరికం, ఇల్లరికం, మామగారి ఆస్తి ప్రస్తుతానికి నీదే...”. “మరి ఫ్యుచరులో...”. “అది చెక్కు చెదరదు. నువ్వుగానీ నాచేత ఈ జాతకం చెప్పించు కోవటం... కంటిన్యూ...చేస్తే మట్టుకూ ఛస్తే దక్కదు. ‘హాఫ్ కోకో నట్ సెమీ బౌల్ ఇన్ యువర్ హాండ్స్...”. “ఎవన్నా ‘డేంజరుగండం’ వుందంటారా కొంపదీస్సి... చెప్పండి, చెప్పండి...”. అని వేధించేస్తున్నాడు... ఆయన చెప్పేస్తున్నాడు.
“నీకు ఇద్దరు సంతానం”. “గురూగారు ‘పప్పులో లెగ్గేశారు’..., నాకు ముగ్గురు సంతానం”. “అద్దేమరి, ఇప్పటికయినా నన్ను వొదిలిపెట్టు, జాతకం సంగతి వొచ్చే జన్మలో చూసుకుందాం.”. “వల్లకాదు... చెప్పేయండి చెప్పేయండి...”. “నీ భార్యనీ, ముఖ్యంగా నీ మామగార్నీ ఈ విషయంలో టచ్ చేయకుండా వుంటే, నీ వైభవం యావత్తూ యధాతదంగా వుంటుంది”. “లేకపోతే....”. “చేప్పెశానుగా... 'లైఫ్ అప్ ఎండ్ డౌన్, అప్ ఎండ్ డౌన్... దెన్ షట్ డౌన్'...”. “విషయం చెప్పారు గాదు”. “ఆ మూడో బుడ్డివాడు నీ...” మొత్తానికి ఆయన గుస గుస లతో అతని చెవులు నిండాయి, గుండెలు చుర్రు మన్నాయి. తన కొంపేదో మునిగినట్లు రైలు ఆగింది, అతను పాపం ఎదో గొణుక్కుంటూ, దిగిపోయాడు. రైలు పెట్టె మాత్రం చాలామటుకు ఖాళీ అయి, మళ్లీ మరో కొంతమందితో నిండింది.

ఆరు నెలల తర్వాత, అదే రైలు స్టేషనులో, ఆ ‘జాతక గ్రహీత’ ఒక సన్యాసిగా వూడిపడి, స్థిరపడ్డాడు. ఎంచక్కా పాడుతున్నాడు కూడానూ “జగమే మాయా, జాతకమే లోయా.... రైల్ బండిలో...ఇంతేనయా.. బతుకులింతేనయా.....” సముద్రాలని పారడీ చేసాడంటే మహార్జాతకుడే అయితీరాలి.
(just follow rasp sadhana for other serious jokes for fun)
"పోయినవాళ్ళతోబాటు మనమూ పోతామాబాబు,....సినిమాకి"
"బాబూ, ఇది ప్రపంచం లోకెల్లా యెత్తైన జలపాతం అంటున్నారుగదా, మరి దాని గొప్ప సౌండు వినపడటంలెదేం!"
"మీతోపాటూ వచ్చిన ఆ నలుగురు 'ఆడ లేడీసూ' వాళ్ళ 'డిస్కల్మషం' ఒక్క క్షణం ఆపితే, మీకోరిక తీరుతుంది".
వీళ్ళు ప్రార్ధిస్తే,అతి కష్టంమీద వాళ్ళు ఆపారు. అప్పుడు భయంకరం అయిన ఆ జలపాతం హోరు వాళ్ళ చుట్టూ మర్మోగింది.
"......"
"ఎటెండెన్సు బాగా ఉండాలోయ్, లేకపోతే చాలా సబ్జెక్ట్లు 'బ్యాకు లాగేస్తాయి '.దెబ్బకి వెన్నుబాము దెబ్బతింటుంది.75% ఎటెండెన్సు లేకపోతే హాల్ టికెట్టు, ఫీజు ఎంబర్సుమెంటు, స్కాలర్ షిప్పు....అన్నీ యెగిరి పోతాయి.-అనంగానే ఈ ఎదవ క్లాసులు 25% మనేయచ్చు అన్నమట: అని వెంటనే మన బ్రైనులో ఒక 'వెధవ ఉటోపియా' ఉదయిస్తుంది కదూ. ఇంకో 'ఉప ఎదవ ఉటోపియా' యేంటంటే- 35% పాస్ మార్కులురా అనంగానే: 65% ఈ యెదవ లెసన్సు వినక్కర్లేదెహ. ఇదీ మన పరిస్థితి.
'మా ముత్తాత గారికి ముప్పైమూడోసారి పెళ్ళిచూపులు అవుతున్నాయి,ఊళ్ళో అందరికి తెలుసు, మీకు తెలియదా?!'-అంటాడొకడు. ఈద్దర్నీ కలిపి తన్నాలి".
ఇంకోడు యేమంటాడంటే: 'మా అమ్మమ్మ చాక్లెట్లతో చారు తయారుచేసింది. దాన్ని శ్రీరామనవమి పందిట్లో పానకంగా పంచిపెట్టాం. అప్పుడు వూళ్ళో అందరికి విరోచెనాలు వచ్చాయి. మీరు తాగలేదా?!'-అంటాడు.
ఇంకోడు: 'మా ఇంటికి వచ్చే పోస్టు మానుకి జలుబు చేసింది, అన్నీ కారిపోతున్నాయీ-అంటాడు.
మరోడు: 'మా వీధి చివ్వర సెంటర్లో ఉంచునే పోలీసుకి వేడి చేసింది, అన్నీ ఆగిపోయాయి '- ఇవీ మీరు మానేయటానికి మహా కారణాలు"-కదూ.
ఇంకా 'కొన్నిన్నర' రోజుల తరువాత ఒక తమాషా జరిగింది. వీడి నాన్న'షేవింగ్ గడ్డం' చేసుకుంటున్నాడు. వీడు ఊరికే వుండక, టైంపాస్ కి 'నాన్నా డిర్ర్ ....' అంటూ లుంగీ పట్టుకు లాగాడు. హటాత్తుగా కదిలేసరికి, నాన్నకి బ్లేడు గీసుకుని గాయం అయ్యింది. నాన్నకి కోపం. వీడి 'వీపు విమానాశ్రయం' అయిపోయింది. వీడికి కూడా కోపం. 'ఛీ నాన్న చచ్చిపోవాలి'. అనేసుకున్నాడు. మళ్లీ 'వద్దులే, ఈసారికి పోనీ'. అనుకున్నాడు.
7."రెగ్యులర్ క్లాసులకి వస్తూ, రెగ్యులర్ గా చదువుతున్న వాళ్ళల్లో 50% మంది గారంటీగా అన్నీ పాసైపోయి, సెకండు యియర్ కి, వెళ్ళిపోతారు. ఎన్ని సబ్జెక్టులు ఫేలైనా, ఓహో, అల్లా అనకూడదు కదూ. మనకి 'బ్యాకు లాగేసినా' పందుల్ని తోసేసినట్లు తోసేయటమే, అదొక మహా సౌకర్యం ఉందిగా; 'రైతు బజార్ రూట్ లో ఆంబోతుల్లా' మనమేమీ సిగ్గు పడనక్కరలేదు. అసలు పరీక్షలలో మన హేండ్ రైటింగు బాగుండాలయ్యో!. అసలే మన హేండ్ రైటింగు చూడంగానే ఆ దిద్దే మహాత్ముడికి 'ఎయిడ్సు' రావడం ఖాయం. ఇంకేం దిద్దుతారూ?! 'ఏప్రెల్ ఎండ్ మే గాడ్ బ్లెస్ యూ'.
“ఇదీ అట్లాంటి ఇట్లాంటి బ్రష్షు కాదు, ఎల్లా వాడాలో తెల్సా?”. “ఎలా?” “బ్రష్షు మీద పేస్టు పెట్టుకోవాలి”. “అది మామూలే ...”. “అది మామూలే ...” ఏం?!“. “మరదే! అది అసలు మామూలే కాదు, నోట్లో పెట్టుకోవాలి”. “ఇల్లా,ఇల్లా తోముకోవాలి....”. “అదీ, అక్కడే బ్రహండమైన డిఫరెంసు, దీన్ని వాడుకోవటం లో వుంది”. “మరెల్లా...”.
“చేత్తో ఇల్లా ఇల్లా తోముకోకోడదు....మన ‘హెడ్డు తలే’ ఇల్లా ఇల్లా అడ్డంగా అడ్డంగా; నిలువుగా నిలువుగా; డయాగ్నల్ గా డయాగ్నల్ గా.....రౌండ్ గా రౌండ్ గా... ఇల్లా ఇల్లా ....తోమేసుకోవాలి”. “తరువాత”. “తరువాత, గుక్కెడు నీళ్ళు నోట్లో పోసుకొని, ‘వుం గడబిడ, వుం గడబిడ, వుం గడబిడ; దడ దడ చుక్ చుక్, దడ దడ చుక్ చుక్, దడ దడ చుక్ చుక్; ఇందాకడిదుందా, ఇందాకడిదుందా, ఇందాకడిదుందా; అని పుక్కిలించి, వుమ్మేయాలి.....”. “గొప్ప సైంటిస్టు గాడైయ్యా బాబు, మీవాడు... వినలేక ఆయాసం వచ్చేస్తోంది...”. “ఇంతకీ ఇది వాడితే, ఆయాసాలు గట్రా అన్నీ పోతాయిట.”. “అవును నేను కూడా పోతాను. వెళ్ళొస్తా..."
“ఏదీ ఆ సబ్బు....?”. “ఇక్కడెల్లా ఉంటుందయ్యా...డ్రాయింగు రూములో.... నీ కన్నిటికీ తొందరే... పద బాత్ రూములోకి...”. “ఏదీ...అలమరల్లో సబ్బులేవీ కనపడవేం!!??”. “కిందికి చూడూ, కిందికి చూడూ....”. “ఇంత నున్నగా వుందేమిటి, టైల్స్ వేయించావా!;తాకి చూద్దాం, సబ్బు’ స్మెల్లువాసనే’..., కొంపతీసి, ఈ నేలంతా మీ వాడి సబ్బేనా ఏంటి?!”. “యా! అంతే.” “దీన్ని తీసి, ఎల్లా రుద్దేసుకోవటం: వొళ్ళంతానూ!?...”. “అద్దేమరి. మొదట రెండు చెంబులు నీళ్ళు వొంటిమీద పోసుకో...”. “తరువాత...”.
“తొందర పడకుండా కింద పడిపోవాలి... లేకపోతే...పడుకోవాలి. ఇంక చుస్కో....ఇప్పుడే తమాషా... ఇటు దొళ్ళు, అటు దొళ్ళు, కిందికి దొళ్ళు, పైకి దొళ్ళు, మళ్ళీ రెండు చెంబులు నీళ్ళు వొంటిమీద పోసుకో... మళ్ళీ నిలువుగా దొళ్ళు, అడ్డంగా దొళ్ళు, ఈ ఐమూలగా దొళ్ళు, ఆ ఐమూలగా దొళ్ళు, మళ్ళీ రెండు చెంబులు నీళ్ళు వొంటిమీద పోసుకో..... అల్లా ఇంకా ఇంకా లోపలికి దొళ్ళు, బయటికి దొళ్ళు...”. “బాత్రూమ్ లోంచి బయటికా?!”. “కాదైయ్యా బాబూ,ఇంక చాలు గానీ సుబ్బరంగా తుడుచుకో...”. “ఇంతకీ అక్కడ నిద్ర కూడా పోవచ్చా!!?, బలే సైంటిస్టు గాడైయ్యో మీవాడు”. “నువ్వేదో ‘గిన్నీసు,పిన్నీసు జీనియస్సు’వి కాబట్టీ, నీకర్ధం అయ్యింది. ఇంక వెళ్లిరా.శుభం”.
“ఆ, గుర్తొచ్చిందిరోయ్, నువ్వా... నీ దుంపతెగ... ఏమీ రాయకుండా, ఇల్లాగే తెగ మొగమాటం పెట్టేస్సి, మార్కులు వేయించుకునేవాడివి, నువ్వా?!...”. “అమ్మయ్య గుర్తు పట్టేశారు.రండిసార్, రండిసార్, రాండిసార్....”. “సరే పద....”.”ఆ, బావుందోయ్, గుర్తు పట్టావు, ఇంటికి తీసుకొచ్చావు, మంచినీళ్ళు ఇచ్చావు; నీ సంసారం, అన్నీ బహు బావున్నాయి. ఇంక వెళ్తాను. శుభం...”. “అబ్బే ఇల్లా వచ్చి, అల్లా వెళ్లి పోతారా; కుదరదు. దయచేస్సి, టిఫెను అయ్యాక వెళ్ళుదురు గాని....”.
ఎప్పటిదో గానీ 'న్యూస్ పేపరు లాంటిది' తిరగేస్తున్నాను; లోపలికెళ్ళాడు. అయిదు, పది, పదిహేను,..... ఇంచుమించు అరగంట దాటింది. ‘ఏమయ్యాడబ్బా?!!... బయటికి వూడిరాడే,...’ చుట్టురా చూశాను.వాడు వెళ్ళిన రూము కర్టెను ఎగిరింది. వాడూ, వాడి కుటుంబం తినేస్తున్నారు: జుర్రుకుంటూ టిఫెను.’ ఇదన్నమాట, ‘టిఫెను అయినాక వెళ్ళమంటే...’వాడి టిఫెను అయిపోయాక మనం వెళ్ళాలని: అర్ధం. మహానుభావుడు, మహా మేధావి: కరెక్ట్ గానే మాట్లాడాడు. మనకే 'అర్ధం అర్ధ భాగం కూడా అర్ధం కాలేదు'.
'మహా సివిలైజుడు'గా కర్టెను తో మూతి తుడుచుకుంటూ బయటికి వస్తున్నాడు. "మాస్టారూ ,ఇంకేమిటి విశేషాలు...." అంటున్నాడు. ఇక తటపటాయిస్తూ...వుంటే లాభం లేదని; “ఇంక ఉంటానులేరా నాయనా...వెళ్ళొస్తా..”.”అబ్బే రాక రాక వచ్చారు, గురూగారూ, భోజనం కాంగానే... వెళుదురుగాని...”.”వొద్దొద్దు, ఇక మొహమాట పెట్టొద్దు. 'ఆటామిక్ ఎనర్జీ కంటే మొహమాటమిక్ ఎనర్జీ చాలా డేంజర్'. ఇబ్బంది పెట్టొద్దు.(నా కాలే కడుపుకి నా వొళ్ళు మండే....) టిఫెను దాకా చాల్లే, మళ్ళీ భోజనాల సంగతి ఎందుకులే?!... వెళ్ళొస్తా...శుభం.
15.రైలు టక టక, టక టక, దడ దడ, దడ దడ, ఇందాకడిదుంద, ఇందాకడిదుంద అంటూ ‘ఫర్గెట్ ఎవ్వెరీ థింగ్ ఎండ్ పర్గేట్ సమ్ వేర్’ అనుకుంటూ పర్గేట్టేస్తోమ్ది. ఒకానొక ‘పెద్దన్నర’ మనిషి: తోటి ప్రయాణికులలో ‘తోచీ తోచని’ వాళ్లకి తనకి తోచినట్లుగా జాతకాలూ, గట్రా చెప్పేస్తున్నాడు. అప్పటిదాకా ముభావంగా వుండిపోయిన .... ఒక ‘ముప్పావు మనిషి’ మిగితావాళ్ళ సాటిస్ఫాక్షను... గమనించి, “న్నాక్కూడా చెప్పండి, న్నాక్కూడా చెప్పండి...”. అని పీకి, ప్రార్దించటం మొదలెట్టాడు. ఆయన వాడి చెయ్యి భూతద్దం మామూలుగా, తలక్రిందులుగా... పెట్టి చూసి, ‘లిప్స్ ని స్టిక్కు బ్రేకు’ చేసినట్లు విరిచేసి,... “అబ్బే, వొద్దు, నేను చెప్పను...” అనేశాడు.
వీడు వెంటబడి, పోరు పెట్టి, ఒదిలి పెట్టాడు. “నేనుగానీ నీకు జాతకం చెబితే సుమా.... నీ జీవితం 'బోటం టు టాప్ – అప్ అండ్ డౌన్' అంటే తలక్రిందులు అవటం ఖాయం, నేచెప్ప నేచెప్ప...” అనేశాడు. వీడు వొదల్లేదు. “ఆ భూతద్దం స్సూటిగా పెట్టుకుని ఆయన చెప్పేయటం మొదలుపెట్టేశాడు... “నువ్వు సగం బాగా చదువుకున్నావు. మేనరికం, ఇల్లరికం, మామగారి ఆస్తి ప్రస్తుతానికి నీదే...”. “మరి ఫ్యుచరులో...”. “అది చెక్కు చెదరదు. నువ్వుగానీ నాచేత ఈ జాతకం చెప్పించు కోవటం... కంటిన్యూ...చేస్తే మట్టుకూ ఛస్తే దక్కదు. ‘హాఫ్ కోకో నట్ సెమీ బౌల్ ఇన్ యువర్ హాండ్స్...”. “ఎవన్నా ‘డేంజరుగండం’ వుందంటారా కొంపదీస్సి... చెప్పండి, చెప్పండి...”. అని వేధించేస్తున్నాడు... ఆయన చెప్పేస్తున్నాడు.
“నీకు ఇద్దరు సంతానం”. “గురూగారు ‘పప్పులో లెగ్గేశారు’..., నాకు ముగ్గురు సంతానం”. “అద్దేమరి, ఇప్పటికయినా నన్ను వొదిలిపెట్టు, జాతకం సంగతి వొచ్చే జన్మలో చూసుకుందాం.”. “వల్లకాదు... చెప్పేయండి చెప్పేయండి...”. “నీ భార్యనీ, ముఖ్యంగా నీ మామగార్నీ ఈ విషయంలో టచ్ చేయకుండా వుంటే, నీ వైభవం యావత్తూ యధాతదంగా వుంటుంది”. “లేకపోతే....”. “చేప్పెశానుగా... 'లైఫ్ అప్ ఎండ్ డౌన్, అప్ ఎండ్ డౌన్... దెన్ షట్ డౌన్'...”. “విషయం చెప్పారు గాదు”. “ఆ మూడో బుడ్డివాడు నీ...” మొత్తానికి ఆయన గుస గుస లతో అతని చెవులు నిండాయి, గుండెలు చుర్రు మన్నాయి. తన కొంపేదో మునిగినట్లు రైలు ఆగింది, అతను పాపం ఎదో గొణుక్కుంటూ, దిగిపోయాడు. రైలు పెట్టె మాత్రం చాలామటుకు ఖాళీ అయి, మళ్లీ మరో కొంతమందితో నిండింది.
ఆరు నెలల తర్వాత, అదే రైలు స్టేషనులో, ఆ ‘జాతక గ్రహీత’ ఒక సన్యాసిగా వూడిపడి, స్థిరపడ్డాడు. ఎంచక్కా పాడుతున్నాడు కూడానూ “జగమే మాయా, జాతకమే లోయా.... రైల్ బండిలో...ఇంతేనయా.. బతుకులింతేనయా.....” సముద్రాలని పారడీ చేసాడంటే మహార్జాతకుడే అయితీరాలి.
(just follow rasp sadhana for other serious jokes for fun)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి