funny jokes collection by rasp sadhana:(16 to 30)
"నవ్వూ నవ్వించూ ఆ నవ్వులందరికి పంచూ ,బ్రతుకంతా ఆ భగవంతుని చిరునవ్వేనని గమనించూ"; నిజంగా తెలివైన, అతితెలివైన, చావుతెలివైన జోకులు: మీకోసమే... you smile, let others smile, distribute smiles to all and every body; observe this life is nothing but a tiny smile of GOD; really these intelligent, foolish, dead innocent jokes all are for you.ok!
(funny jokes collection by rasp sadhana:(16 to 30)
- కోర్టు శీను మొదలెట్టారు. కిటకిట లాడుతోంది. “జడ్జీగారు వొస్తున్నారోచ్... సైలెన్సు సైలెన్సు సైలెన్సు...” అందరు లేచి నుంచుని,.....దులుపుకుని, మరిట్టే కూర్చున్నారు. “ప్రమాణం చేయిస్తున్నారు.
“దేవుని ఎదుట...దేవుని ఎదుట; ప్రమాణం చేసి.... పరమాన్నం చేసి; అంతా నిజమే చెబుతాను.... అంతా నేనే తింటాను; అబద్ధం చెప్పను....ఎవరికీ పెట్టను;”. “ఏమిటా ప్రమాణం!... ” ఏదో ఓటి కానీయండి; కలియుగ ప్రమాణం ”. “ఆడర్ ఆడర్ ఆడర్...”. “అందరూ ఆర్డర్ లోనే వున్నారు”. “సర్లే, ఏదో అలవాటు కొద్దీ అనేశాను”. “అద్దేమరి....”. “ డిఫెన్సు, ప్రోసిక్యుషను: ఎవళ్ళో ఒకళ్ళు, ఏదో ఓటి మొదలెట్టండి”.
“ఏయ్ మిస్టర్, అవతల బోనులో వున్న వ్యక్తి నీకు తెలుసా?...”. “తెలీదండి”. “మరి అతని దగ్గర రెండు సూట్కేసులు కొట్టేశావని...కేసు పెట్టాడు”. “అనేగదా... నన్ను అరెస్టు చేసిపారేశారు”. “ఇంతకీ, నువ్వు నిజం ఒప్పుకుంటున్నావా...”. “దేనికండీ! ఏ నిజమండీ?!...ఆ రోజు ఏం జరిగిందో... మీకు తెల్సా?...”. “ ఆడర్ ఆడర్ ఆడర్ ముద్దాయి కరెక్టుగా సమాధానాలు ఇవ్వాలి”. “కరెక్టు గానే ఆన్సరు ఇస్తున్నాను. ఆ రోజు ఏం జరిగిందో... మీకు తెల్సా...? జడ్జీగారికి తెల్సా?... లాయర్లకి తెల్సా? దేవుడికీ, నాకూ, ఆ బోనులో... నామీద ‘సూటు కేసులు’ పెట్టి..., నుంచున్న పెద్ద మనిషికి తప్ప ఎవ్వరికీ అస్సలు నిజం తెలియదు”. “ఇంతకీ నువ్వు ఏం చెప్పబోతున్నావ్?!”.
“ఆ రోజు ఏం జరిగిందో... అదే.... రెండు సూట్ కేసులతో ఆ పెద్దమనిషి రైల్ స్టేషన్ లోంచి బయటికొచ్చాడు”. “అమ్మయ్యా, దారిలోకొచ్చాడు...”. దారిలోనే వున్నాం. బోనులోంచి చెబుతున్నా, కొసాకి అంటే అప్ టు ఎండ్ వినండి”. “ముద్దాయిని డిస్ట్రబ్ చేయకండి, లెట్ హిం సే”. “అబ్బా!...మీరండీ, ఏ రియల్ జడ్జీ...ధాంక్యూసార్, అప్పుడు... ”.
“మాస్టారూ... అటేపు వెళ్తున్నారేమిటి!?...”. “ఏం, వెళ్ళకూడదా!?”. “వెళ్ళచ్చు, కానీ ఈ వీధి చివ్వర... బోళ్ళందరు దొంగలున్నారు మరి... ఈ రెండు సూట్ కేసులు కొట్టేస్తారు... ”. “మరెల్లాగా... ఇప్పుడేంచేయటం!...?. “ఆ రెండు సూట్ కేసులూ... ఇట్టా నాకిచ్చేస్సి, ఇటేపు ఆక్కుండా... వెళ్ళిపొండి, అప్పుడంతా ‘సేఫ్ ఎండ్ ఓకే’!?...” “అల్లాగే అల్లాగే ఓకే!”..... “అంటూ, ఆయనే... నేనడిగితేనే ఇచ్చేశాడు”.
లాయర్లూ, జడ్జీగారూ ఒకళ్ళ కొకళ్ళు కోరస్ గా అనేశారు: “మరి, మళ్ళీ...కేసు ఎందుకు పెట్టినట్టు?!...” “అద్దేమరి, నాక్కూడా అర్ధం కాదు... అడిగితే.... ఇస్తే, పుచ్చుకుంటే... దాన్ని దొంగతనం అంటారా?! న్యాయమేనా!?....ధర్మమేనా!?...”. ”అతను చెబుతున్నది నిజమేనా!?, అడిగితేనే ఇచ్చారా, అడక్కుండా లాక్కున్నాడా?!...నిజం చెప్పండి”. ఆయన పాపం అందరికీ దణ్ణం పెట్టి మరే...నిజం ఒప్పుకున్నాడు. “ చూశారా మరి, ఆడర్ ఆడర్ ఆడర్ అంటున్నారు; ఓ ఆర్డరు లేకుండా నన్ను అరెస్టు చేసేశారు... మీరంతానూ కోర్టు కీడ్చేసారు”. “మరి అది మోసం కాదా...”. “మోసం కాదూ, దొంగతనం కాదూ, ద్రోహం కాదు.... ‘హూ, టైం వేస్టు కేసు, కేసు కొట్టివేయడ మయినది”. కోర్టు మెట్ల మీద... “ఇదిగోండి, ఇంద, మీ రెండు ఖాళీ సూట్ కేసులు..”. “అయ్యబాబోయ్, ఖాళీవా!?...”. “మరి, అదికూడా మీరేమీ అడక్కుండా ఇచ్చేస్తున్నాను. కోర్టు ఎదుటే...., ప్రయాణాలలో... జాగ్రత్తగా వుండండి మరి...ఓకే!...”.
- “సార్ పేద్ద డైనోసార్ బాబూ... పేద్ద డైనోసార్...” . “ఏం?!.. ఈ యుగంలో జీవించటంలేదా?...”. “ఎందుకు లేదూ, ‘యుగచాదస్త పురుషుడు’...”. “చాలా ఖచ్చితంగా వుంటారటగదా...?!”. “అవును, ఎబ్ నార్మల్ ఎండ్ వెరైటీ పర్సన్, చాలా నిఖచ్చితం, పంచువల్, ప్రాంప్ట్, మహా డిసిప్లెన్,మహా మనీషి,... వగైరా వగైరా.... అన్నీ ఆయనే మరి...”. “టైం టేబిలుకి ప్రాణం ఇచ్చేస్తాడంటగా....”. “టైం టేబిలుకి ప్రాణం ఇచ్చేస్తాడు, చాలా సార్లు తీసేస్తాడు కూడాను ‘సెంట్ పర్సెంట్, మోస్టు డిఫెరంటు’ ఫెలో, ‘చాదస్తం పవర్ ఆఫ్ అష్టాదశమ్ ”. “నువ్వు మరీనూ....”. “ఓకే స్సారి ఆయన ఇంటికి వెళ్ళాను. సాయంకాలం, మొక్కలకి నీళ్ళు పోస్తున్నాడు. టైం టేబిలులో ‘వాటర్ టు ప్లాంట్స్’ అదే, మొక్కలకి నీళ్ళు పోయుట: అని వుందిట, గొట్టం పట్టుకుని చిమ్మేస్తున్నాడు, పోసేస్తున్నాడు, భోరున వానలో, రైన్ డ్రెస్ వేసుకొని, గొడుగు పెట్టుకుని...అదీ సంగతి”.
- ”ఏయ్ మిస్టర్ బాంక్ లోంచి బయటికో...చ్చినప్పటినుండి చూస్తున్నా, నావెంట పడుతున్నావ్, ఏం, ఆటో స్టాండు, టాక్సీ స్టాండు.... ఆటలుగా వుందా?!... నాకు ఈ ఏరియా సీ.ఐ, ఎస్.ఐ... బాగా తెలుసు; తెలుసా!?...”. “నాకు ఆల్ ఇండియా హోం గార్డులు, కానిస్టేబుల్సు, సెంట్రల్, స్టేట్: హోం మినిస్టర్లు... వీళ్ళంతా... కూడా బాగా తెలుసుగానీ.... మర్యాదగా బాంక్ లో, నువ్వు డ్రా చేసిన డబ్బులతో బాటూ, నన్నడిగి తీసుకున్న నా పెన్నుకూడా నీ సంచీలో పడేసుకుని, నీ మానాన నువ్వు వుడాయించేస్తున్నావ్..., నేనే నీమీద ‘పెన్నుల దొంగ’ అని కేసు పెట్టేయగలను. ఇచ్చేయ్ ఇచ్చేయ్...యూ సిల్లీ జెంటిల్ మాన్!”.
- బోర్డు మీద ఎండ్ లెస్ గా బోళ్ళంత ఏదేదో రాసేసి, వెనక్కి తిరిగిన మాష్టారు “ఏం నాయనా నువ్వొక్కడివే ఉండిపోయావ్, క్లాస్ మొత్తానికి, సబ్జెక్టు మీద అంతా దయా నీకు,...”. “అదేమీ కాదండి.వాళ్ళంతా కేర్ లెస్ ఫెలోస్ సార్, మీ చేతిలో నా బుక్కు వుండిపోయింది. అదిచ్చేస్తే....”. “నువ్వూ దయచేస్తానంటావ్, ఓకే! దయచెయ్యి...”.
- స్కూల్ బెల్ కొట్టారు. అందరూ వచ్చేశారు. “ఇవ్వాళా: స్కూళ్ళ ఇన్స్పెక్టర్ వస్తారు. స్కూళ్ళ ఇన్స్పెక్టర్ వస్తారు. స్కూళ్ళ ఇన్స్పెక్టర్ వస్తారు. అదిగో వచ్చేశారు”. అరగంట గడిచింది. స్టూడెంట్ ఒకడు ముందుకు వచ్చాడు. “నమస్తేనండి నమస్తేనండి నమస్తేనండి...”. “ఏం! ఇప్పుడు పెడుతున్నావ్?!”. “ఇందాక -మరిచిపోయానండి”. “ఏమిటీ?!”. “దణ్ణం పెట్టటం”. “ఓహో! మంచిది. మరి మూడు సార్లెందుకు పెట్టావ్?!...”. “రేపడిది, ఎల్లుండిది కూడా నండి. నేను రేపు, ఎల్లుండి రాను గదండి. అందుకని.”. “బావుంది ‘మహా ముందు జాగ్రత్త’న్నమాట...
‘ఎటెండేన్సు పలకండి...ధర్మరాజు...ధర్మరాజు...ధర్మరాజు... ఎవడ్రా ఈ ధర్మరాజు...”. ”ఏమోనండీ...”. “మహాభారతం లో ధర్మరాజా!...”. “ఆ ధర్మరాజో, యమ లోకంలో ధర్మరాజో...తెలీదండి”. “పిల్లలూ! మీకు మహాభారతంలో ధర్మరాజు తెలుసా?!...”. “తెలీదండి, వాడు మా స్కూల్ లో చేరలేదనుకుంటానండి”. “ఎమైయ్యా హెడ్డు మాస్టారూ...?!”. “ఆ పేరు గల వాళ్ళు మా స్టాఫ్ లోకూడా ఎవ్వరూ లేరండి”. “శుభం నన్ను క్షమించండి గానీ, పిల్లల్లో సోషల్ ఎండ్ సైన్సు నాలెడ్జి ఎల్లా వుంది? బాగా చదివించండి.”. “ఏదో వుంది సార్...ఈ రవి గాణ్ణి అడిగితే, బలేగా అన్సర్లు ఇస్తాడు ”. వరసాగ్గా మూడు రోజులు ఆయన ఇన్స్పెక్షన్ కి వచ్చాడు.
మూడో రోజున.... “బాబూ, రవీ... భూమి ఏ ఆకారంలో వుంది?”. ‘డుయ్!...’ భూమి ఏ ఆకారంలో వుంది?”. ‘డుయ్!...’ భూమి ఏ ఆకారంలో వుంది?”. ‘డుయ్!...’”ఎన్ని సార్లు అడిగినా అల్లా స్టుడెంట్స్ అంతా కిందికి చూస్తున్నారేంటీ?!...”. రవిగాడి ఆన్సరు. “అవునుసార్!, మరండి, మొన్నేమోనండి... బత్తాయి పండులా వుండండి. మరి నిన్నేమోనండి నారింజ పండులా మారిపొయిందండి”. “మరి ఇవ్వాళా?!.... ఇవ్వాళ ఎల్లా అఘోరించిందీ?!...., అదీ... నువ్వే సెలవియ్యీ...” మరి భూమేమో ఇవ్వాళా... అరటి పండులా మారిపోయిందండి...అవ్వే కదండి ఇవ్వాళా మార్కెట్ లో దొరికింది...”. “అయ్యో! పొట్లకాయలా మారిపోలేదూ?!... అదేమిటిరా!?... అల్లా ఎందుకైయ్యింది!?...”. “మరండి, మీ విజిట్ చాలా సార్లు పోస్ట్ పోన్ అయిపోఇంది కదండి... ఇప్పుడు మీరు మూడు రోజుల విజిట్ కి వచ్చారుకదా, అప్పుడు రొజూ... మీకు ఫలహారంగా పళ్ళు తెప్పించుతున్నారు కదా, రోజూ మా మేష్టారు... కింద, నేలమీద ఆ పళ్ళ తొక్కలతో ఏ ఆకారం పెడితే, ఆ ఆకారంగా భూమి వుంటుంది,... లేకపోతే మారిపోతుంది సార్!..”. “అని మీకు ఎవరు సెలవిచ్చారు నాన్నా?!....”. “ఆమధ్య... సెలవులిచ్సెముందే... మా సారే చెప్పారు సార్!...”.
- “వచ్చారా!...చాలా త్వరగానే వొచ్చేసారే ”. “ఎదో... ఆఫీసులో పనై పోయింది... వొచ్చేశా... ఇవ్వాళ... ఏం చేసావ్?!, ఎదో తయారుచేసేస్సి,... నా మీద ప్రయోగిస్తావ్ గా... ఏం చేశావ్ ఏమిటీ!?...” “కాళ్ళు, చేతులు కడుక్కురాండి...మరి...”.... ” ఆ, ఏదీ!... నీ ఎక్స్ పరిమెంట్ రిజల్టు!?..”. ”ఇదిగో... సస్పెన్సు జీడిపప్పు పాయసం...”. “ ఏమిటీ!... సస్పెండు!!?...”. “సస్పెన్సు జీడిపప్పు పాయసం... దట్స్ ఆల్”. “బావుంది,.... వున్యాం..... వున్యాం... అవును దీన్లో జీడిపప్పులేవీ??!!...”. “అదే మరి, సస్పెన్సు, జీడిపప్పులు అతి తక్కువ వేసాను, ఆ వున్నవి మాత్రం... పిల్లలూ... చెంచాతో... ఏరుకొని ఏరుకొని తినేశారు. ఇంతకీ మీ ఇంక్రిమెంటు...!?”. “దాని మా మేనేజిమెంటు సస్పెన్సు ఎకౌంటులో పడేసింది ఈ సంవత్సరానికి సస్పెన్సు ఎకానమీయే!”.
22.“ఇక్కడ చాలా లోతుగా ఉన్నట్టుంది. జనాలని అలర్టు చేసే కాషన్ బోర్డు కూడా పెట్టలేదు చూసావా!”. “చూశాను, నేనిక్కడికి చాలాసార్లు వస్తుంటాను. రెండేళ్ళ నుంచీ ఎవరూ మునిగిపోవట్లేదని తెలుసుకుని, ఆ బోర్డు ఇక్కడ పెట్టటం దండగ అనిపించి, టూరిజం డిపార్టుమెంటు వాళ్ళు తీయించిపారేసారు. అది సంగతి.”
23.“నా భార్యకి ఉన్న మహాజబ్బు ఒకటి ఈమధ్య వొదిలిపోయింది”. “ఏమాజబ్బు!, ఎల్లా వొదలగొట్టావు?”. “ఓ చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి”. ఏమది!?”. “యేముందీ!…ఎవరి కోపం గురించో తాను చెబుతున్నప్పుడు… యాదాలాపంగా… ‘ఈ ముసలితనం, కోపం ఒకదాన్నొకటి పరస్పరం పెంచి పోషించుకుంటాయి…’-అనేసా…అంతే…”
24.“నిన్న రాత్రి ఒకటి దాకా బ్రహ్మాండంగా చదివేసాను నాన్నా….”. “ఏడిశావ్, రాత్రి పదిన్నర నుంచీ తెల్లారేదాకా కరెంటే లేదు…”. “ఓహో నేను నా కాంసెంట్రేషనులో పడి, అదంతా గమనించలేదనుకుంటా…థాంక్ గాడ్…”
25.అదో మెంటల్ హాస్పటల్, సూపరు మధ్యాన్నం. సరదాగా చూద్దామని ఒక విజిటరు విచ్చేశాడు. అదిగో…. ఒకడు గోడకి చెవి పెట్టి, గాల్లోకి లెక్కలేస్తున్నాడు… యాంగ్జైటీ పెరిగి పోయి, వాడి వీపు తట్టి, ‘బాబూ, ఏమి వింటున్నావు? ఏమి వినపడుతోంది?’ అని అడిగాడు. అంతే, వాడు జవాబివ్వకుండా గాల్లో దోసెలేసుకుంటూ… వెళ్ళిపోయాడు.
‘పాపం వెర్రివాడు…’ అనుకుంటూ…’ఇంతకీ ఏమి వింటున్నాడు? ఏమి వినపడుతోంది?… అనే యాంగ్జైటీ ఇంకా పెరిగి పోయి, తనూ అక్కడే గోడకి చెవి ఆన్చి, వినడం మొదలెట్టాడు. ‘ఏమీ వినపడటం లేదే… ఏం వింటున్నాడబ్బా… అనుకునేలోపే… ఈ సారి వీడి వీపు ‘ధన్’…మంది. చుర్రు మంటోంది. చూస్తే ఇందాకటి వెర్రివాడు… “నేను తెల్లారి పొద్దున్నుంచీ వింటుంటే… చిన్న సౌండ్ కూడా వినపడలేదు. నువ్వు ఒకటిన్నర నిమిషాలు వింటే సౌండ్ వచ్చేస్తుందా!… వెర్రి పిచ్చి చచ్చినోడా, పిచ్చి వెర్రి బతికినోడా…” అంటూ వెళ్ళిపోయాడు. పాపం మనవాడికి ఆ మాటలు సగం అర్ధం అయ్యాయి కానీ ఇంకా వీపు మంట పూర్తిగా తగ్గనేలేదు.
- కొత్తగా వచ్చిన జూనియర్ – ‘ఇక్కడి స్టాఫ్ అంతా చాలా కో ఆపరేటివ్ హార్ట్స్’- అనుకుంటూ, మీటింగు హాల్ లోపలికెళ్ళాడు. మేనేజింగ్ డైరెక్టర్స్ రౌండ్ టేబులు కాన్ఫెరెంసు అవుతోంది. హటాత్తుగా డైరెక్టర్ అడిగాడు: “ఈ అయిడియా ఎవరికీ వచ్చిందీ?!”. అని అనంగానే, ఎవళ్ళకు వాళ్ళు తమ చేతులెత్తేశారు ‘మేమే…’ అన్నట్టు. ఆయనే మళ్లీ “ఈ అయిడియా పరమ చండాలం, సూపరు దరిద్రంగా ఉంది!” అనంగానే… చటుక్కున ఆ ఎత్తిన చేతుల్నే పక్కవాళ్ళకేసి చూపించేశారు… అంతానూ. ఇది చాలా సహజమైన సీను కదా. అప్పటి నుంచీ ఆ జూనియరు మెల్లిగా సీనియరు అవటం మొదలెట్టాడు.
27.“నేను అర్జెంటుగా అన్నం తినేస్సి, అంతకన్నా యమార్జెంటుగా ఓ ముఖ్యమైన చోటికి వెళ్లిపోవాలి”. “ఎక్కడికి?”. “అర్జెంటు వర్కు…”. “అదే, ఏమిటి… అని అడుగుతుంటే చెప్పరేమీ?…”. అతను చక్కగా, మౌనంగా, చాలా వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు… పాపం… రెండు వేళ్ళు చూపిస్తూ…

28.న్యూసు+సెన్సు=న్యూసేన్సు:1.తుఫాను దెబ్బ తిన్న ప్రాంతాలలో హెలికాప్టర్లను ఉపయోగించి, ఆహార పొట్లాలతో నిండిన బస్తాలు విజయవంతంగా జారవిడిచారు. అయితే ఆ బస్తాలు మీదపడి మరణించినవారి సంఖ్య 28కి చేరింది. వారి కుటుంబ సభ్యులకు అనేకమంది పొలిటీషియన్లు, మంత్రులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ… పనిలో ‘ఉపపని’గా ఉగాది మరియు అన్ని మతాల పండగలకి, పబ్బాలకి ఎండ్ ‘ఈవినింగ్ యూత్ పబ్బూ’లకి శుభాకాంక్షలు కూడా తెలియజేసారు.

29.న్యూసు+సెన్సు=న్యూసేన్సు 2. స్థానిక ‘ఇంటర్ నేషనల్ జూ’ లో ఓ వింత జరిగిపోయింది. ఇంతకీ ఆ వింతేమిటంటే… ఆ ‘జూ’ అధికార్లు: ఒక ‘చిన్నన్నర’ నల్లటి అనకొండని, ఇంకో ‘బుడ్డిన్నర’ తెల్లని ‘అనకొండచిలవ’ని- ‘మరేం ఫర్లే!’దనుకొని… పక్క పక్కనే ఉన్న బోనులలో ప్రదర్శనకి ‘అచ్చోసి’, మరిట్టే సిద్ధం చేశారు.
కొంత సేపటికి…ఆ ఫళంగా… ఆ రెండూ ఒకదాని తోక ఒకటి కరిచి, పట్టేసుకున్నాయి, గుంజుకున్నాయి, గిల గిల్లాడాయి. అధికారులు, ప్రజలు వాటిని ‘సజీవంగా’ విడగొడదామని చేసిన ప్రయత్నాలన్నీ… అదేమిటో ‘నిర్జీవంగా’ ఫేలైపోయాయి. ఇది ఇల్లా ఉండగా ఇంకో మహా వింత జరిగిపోయింది. ఏమిటంటే… ఆ రెండు పాములూ ‘చటుక్కున+పుటుక్కుమని’ మటుమాయం అయిపోయాయి. అది: ప్రత్యక్షంగా…. ఆ ‘ఖాళీ బోనులు’ చూడటానికి… తండోపతండాలుగా ‘స్వదేశీ ఎండ్ విదేశీ’ జనం ఒకళ్ళ వొళ్ళు: ఒకళ్ళు విరుచుకు పడిపోతున్నారు. ఏళ్ళ తరబడి ఆ ‘రష్షు’ అస్సలు తగ్గనే తగ్గలేదు. ఇటివల విశ్వ విఖ్యాత జీవ శాస్త్రజ్ఞులు- ఈ ‘వింత విషయం’ పై ప్రశ్నించగా ఇల్లా సెలవిచ్చారు. “ అవి కాసేపు పెనుగులాడి, ఒకదానిని ఒకటి అమాంతం నమిలి, చప్పరించి, చటుక్కున, పుటుక్కున, పైగా ‘గుటుక్కున’ మింగేసి ఉండవచ్చునని, అందుకే అవి మటుమాయం అయి ఉండవచ్చునని ప్రకటించారు. శుభం
30.“ఆహా!, ఈ ఉంగరం సింప్లీ సుపర్బ్… ఎండ్ వెరీ నైస్… దీన్ని పా’క్ చేయండి. ఇదిగో… నా క్రెడిట్ కార్డ్…”. “సార్!, మైక్రోస్కోపిక్ ప్రింట్ లో దానిపైన యేమని ప్రింట్ చేయమంటారో చెప్తారా…”. “ఓకే, ఇల్లా రాయించండి. ‘జన్మ జన్మలకూ నా హృదయేశ్వరికి ప్రేమతో…’. “ఆమె పేరుకూడా చెప్పండి సార్, చక్కగా ఇప్పుడే… లాగేద్దాం…”. “అల్లాక్కాదులే…పేర్లేమీ వద్దు, ఈ జన్మలోనే… చాలాసార్లు వాడేద్దామని… ఏమంటావ్?, ఆశ్చర్యం తరవాత పోదూగాని, ప్రింటింగ్ మొదలెట్టు”.
(just follow rasp sadhana for jokes from many languages)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి